![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి' (Krishna Muknda Murari). ఈ సీరియల్ కి శుభం కార్డు అని తెలుగువన్ లో ముందుగానే చెప్పేశాం అది ఇప్పుడు నిజమైంది. ఈ సీరియల్ కి శుభం కార్డు పడింది. శనివారం నాటి చివరి ఎపిసోడ్ -491 లో.. కృష్ణ కళ్ళు తిరిగి పడిపోతుంది. దాంతో డాక్టర్ పరిమళ వచ్చి తను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. గర్భ సంచి తీసేసారని అన్నారు కదా.. ఎలా ప్రెగ్నెంట్ అవుతుంది డాక్టర్ అని మీరా అలియాస్ ముకుంద అనగానే.. సెకెండ్ ఒపినీయన్ తీసుకోవాలి కదా.. డాక్టర్ వైదేహీ గర్భసంచి తీయలేదు.. ఇప్పుడు కృష్ణ ప్రెగ్నెంట్ అని పరిమళ చెప్తుంది. ఇక భవాని, రేవతి, సుమలత అందరు హ్యాపీగా ఫీలవుతారు. డాక్టర్ వెళ్ళిపోయాక మీరా కూడా తన గదికి వెళ్తుంటే.. భవాని పిలుస్తుంది.
ఎవరు నువ్వు అని మీరాని భవాని అడుగగా.. నేను ముకుంద ఫ్రెండ్ మీరాని అని చెప్తుంది. వెంటనే మీరా చెంపచెల్లుమనిపిస్తుంది భవాని. ఎవరు నువ్వు చెప్పు అని భవాని నిలదీయగా.. ఎవరి పేరు చెప్తే మీ ఒంటి మీద పాములు, తేళ్ళు పారతాయో అదే నేను ముకుంద అని మీరా చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత కాసేపటికి కృష్ణ తల్లి అవుతుందని రేవతి, సుమలత, భవాని సంతోషిస్తారు. అయితే మీరా కడుపుతో ఉందని సంతోచించాలా.. తన మనసేం మారలేదని భాదపడాలా అర్థం కానీ సిచువేషన్ లో అందరు ఉంటారు. ఇక అప్పుడే అదర్శ్ వచ్చి భవాని కాళ్ళ మీద పడతాడు. తను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడో చెప్పుకొని భాదపడతాడు. ఇక కృష్ణని క్షమించమని అడుగగా.. తను ఆదర్శ్ ని క్షమించేస్తుంది. నేను ముకుందకి అండగా ఉంటానని ఆదర్శ్ అనగానే.. తను అలా ఉంటే ఎలా కలిసి ఉంటావ్ రా అని రేవతి, అడుగగా.. తనని మార్చుకుంటా అని ఆదర్శ్ అంటాడు. ఇక మురారి గురించి భవాని టెన్షన్ పడుతుండగా.. మురారి హాస్పిటల్ లో ఉన్నాడని కృష్ణ చెప్తుంది. ఇక అందరు కలిసి హాస్పిటల్ కి వెళ్తారు. ఇక డాక్టర్ మురారిని చూసి.. తనకేం పర్లేదు తీసుకెళ్ళొచ్చని చెప్తుంది.
అదే సమయంలో మురారి కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతాడు ఆదర్శ్. నేను వెళ్తానని అదర్శ్ అనగానే.. నిన్ను కలిసి ఉండమని అన్నాం.. విడిపోయి వెళ్ళమని చెప్పలేదని మురారి అనగానే.. అందరు హ్యాపీగా ఫీలవుతారు. ఇక అదర్శ్, మురారి, కృష్ణ , భవాని, రేవతి, మధు, సుమలత అందరు హ్యాపీగా ఫీలవుతారు. హాస్పిటల్ నుండి ఇంటికొచ్చేస్తారు. ఆరు నెలల తర్వాత కృష్ణకి బాబు పుడతాడు. భవాని, రేవతి అందరు ఎత్తుకొని ముద్దాడుతూ మురిసిపోతుండగా.. ముకుంద సరోగసి ద్వారా కన్న తన బిడ్డని కృష్ఞకి ఇచ్చేస్తుంది.. ఇదిగో కృష్ణ మీ బిడ్డ అని చెప్పి ముకుంద వెళ్తుంటే మురారి ఆగమని చెప్తాడు. మాతో కలిసి ఉండమని చెప్తాడు. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టానో తలచుకుంటే నా మీద నాకే ఆహ్యమేస్తుంది. మిమ్మల్ని క్షమించమని అడగడం తప్పితే నేనేం చేయలేనని ముకుంద అంటుంది. కృష్ణ, మురారీలు కూడా తనని క్షమించేస్తారు. ఆ తర్వాత తొమ్మిది నెలలు మోసిన బిడ్డ అంటే ప్రేమ ఉండదా.. ఈ బిడ్డ నీదే ముకుంద అని తనకి ఇస్తుంది కృష్ణ. ఇక ఆ బిడ్డని ఎత్తుకొని ముద్దులిస్తూ మురిసిపోతుంది ముకుంద. ఇన్నాళ్ళు నా కుటుంబంలో ఈ సంతోషాన్నే నేను కోరుకుంది అని భవాని అంటుంది.ఇక అందరు హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత శుభం కార్డు పడింది.. సీరియల్ ముగిసింది.
![]() |
![]() |